5PM Dynamic: కేసీఆర్‌కు డబుల్ షాక్.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. కేటీఆర్ హ్యాపీ

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-03-19 14:07:20.0  )
5PM Dynamic: కేసీఆర్‌కు డబుల్ షాక్.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. కేటీఆర్ హ్యాపీ
X

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇవాళ ఒక్కరోజే డబుల్ షాక్ తగిలింది. మా నియోజకర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. 15 నెలల క్రితం మిస్సింగ్ అయ్యారని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కేసీఆర్ ఆఫీస్ ఖాళీగా ఉందని, అద్దెకు కావాల్సిన వాళ్లు సంప్రదించవచ్చని బీజేపీ నాయకులు క్యాంప్ ఆఫీసుకు టు-లెట్ బోర్డు పెట్టారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. కేటీఆర్‌కూ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ పై నమోదైన కేసులో పాజిటీవ్ తీర్పు వచ్చింది. ఈ మూడు సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేను గుర్తించారు. ఆయన ఆస్తులు ఏకంగా రూ.3400 కోట్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరించింది. అలాగే టాప్ 20 జాబితాలో ఏపీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలకు స్థానం సంపాదించారు. వారిలో చంద్రబాబు అగ్రస్థానంలో ఉండగా.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చివరి స్థానంలో ఉన్నారు. అంతే కాదు.. దేశంలోనే అతి బీద ఎమ్మెల్యేగా నిర్మల్ కుమార్‌ను గుర్తించారు. ఆయన ఆస్తి విలువ కేవలం రూ.1700 మాత్రమే. ఏడీఆర్ వెల్లడించిన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

మనం మన మాతృ భాషతోపాటు మహా అంటే ఇంకా ఒకటో, రెండో భాషలు మాట్లాడుతాం. అది కూడా సగం సగం మిక్సింగ్‌లో.. కానీ ఈ అబ్బాయిని చూస్తే ముక్కున వేలేసుకుంటారు. చూస్తే 20 ఏండ్లు కూడా లేవు కానీ.. వందల భాషాల్లో మాట్లాడేస్తాడు. అంతేకాదు.. రాయడమూ వచ్చు. ఎనిమిదేళ్ల వయసుకే ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఈ అబ్బాయి ఎక్కడివాడు.. ఎలా ఇన్ని భాషలు నేర్చుకున్నాడో ఈ లింకులో చూడండి.

ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో రోజుకో కొత్తరకం బ్రాండ్ మద్యం లభించేది. ఆ పేర్లు కూడా గమ్మత్తుగా ఉండేవి. ఇప్పుడు ఓ సారు అదే మాదిరిగా కొత్తరకం బ్రాండ్ కాదు కానీ.. ఏకంగా కొత్త మద్యాన్నే కనిపెట్టాడు. కొబ్బరి తోటకు యజమాని అయిన ఈ ఆసామి కొబ్బరినీళ్లతో వైన్ తయారు చేశాడు. చూస్తానికి తాటికల్లు మాదిరిగానే ఉన్న ఈ వైన్ మంచి మత్తే ఇస్తుందట. మరి ఆ కొబ్బరివైన్‌ను తయారు చేసింది ఎవరు..? దాని రుచి, వాసన ఎలా ఉంటుందో ఈ లింక్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది.

Next Story