BRS నేతలకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

by Satheesh |
BRS నేతలకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోచారం ఇంట్లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా.. బీఆర్ఎస్ నేతలు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. బీఆర్ఎస్ లీడర్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ఆదేశించింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరికను వ్యతిరేకిస్తూ బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడటంతో పాటు బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను సైతం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed