- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Big News: రాష్ట్రంలోని గౌడన్నలకు భారీ గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రారంభించబోతున్న సీఎం రేవంత్‌రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గౌడన్నల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. కల్లు గీసే గీతా కార్మికులకు బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్దసేపట్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని లష్కర్‌గూడలో కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఆయన గౌడ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. సీఎంతో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర మంత్రులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, తాటిచెట్టు ఎక్కే సమయంలో గీత కార్మికులు కింద పడకుండా ప్రత్యేకంగా రూపొందించిన కాటమయ్య రక్షణ కవచ్ సేఫ్టీ మోకులు పనిచేస్తాయి. అయితే గౌడ కులస్థులు ఆరాధించే కాటమయ్య పేరును ఈ పథకానికి ప్రభుత్వం పెట్టడం విశేషం