- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: చేరికలకు సీఎం పక్కా స్కెచ్..! బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భరోసానిచ్చేలా వ్యూహం
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, సీఎం అమెరికా టూర్ నేపథ్యంలో వాయిదా పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను తిరిగి మొదలు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ నుంచి రాగానే ఈ టాస్క్‌ను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అమెరికాలో ఉన్న సీఎం ఇప్పటికే స్టేట్‌కు చెందిన తన కోర్ టీమ్‌కు పలు సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. జాయినింగ్స్‌ను స్పీడప్ చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించారు. కాంగ్రెస్‌లో జాయినింగ్స్‌కు స్వల్ప బ్రేక్ పడటంతో బీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు కాంగ్రెస్ పసిగట్టింది. దీంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చేరికలు జరగకుండా అడ్డుకునేందుకు, పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని సీఎం తన టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం వచ్చే లోపు చేరాలనుకునే ఎమ్మెల్యేలను సిద్ధం చేయాలని కోర్ టీమ్ లీడర్లు హడావిడిగా చర్చలు కొనసాగించడం గమనార్హం.
భరోసానే ‘బ్రేక్’కు కారణమా..?
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరే ఎమ్మెల్యేలకు స్పష్టమైన భరోసా లభించడం లేదని ఇప్పటికే చేరిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. జాయినింగ్ సందర్భంగా పార్టీలో గుర్తింపు, రాజకీయ భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధి వంటి వాటిపై కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో భరోసా రావట్లేదని ఆయన ఫీలయినట్టు తెలిసింది. ఇప్పటికే దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావ్(భద్రాచలం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), సంజయ్ కుమార్(జగిత్యాల), కాలే యాదయ్య(చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల), ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), అరికపూడిగాంధీ(శేరిలింగంపల్లి), మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు)తో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆయా నేతలెవ్వరికీ ఇప్పటి వరకు పార్టీలో సముచితం స్థానంతో పాటు పదవీ ప్రమోషనపై క్లారిటీ లేదు. దీంతో కాంగ్రెస్‌లోకి రావాలనుకున్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరూ తాజాగా బీజేపీ ముఖ్య లీడర్లతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. దీంతో వారిని కాంగ్రెస్‌లోకి గుంజేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక వ్యూహాం అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తన కోర్ టీమ్‌కు వివరించినట్టు తెలిసింది. జాయినింగ్స్‌పై మరోసారి ఢిల్లీ పెద్దలతో సీఎం చర్చించి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయనున్నారు.
టార్గెట్ ఇదే..?
నిజానికి రాజకీయ అవసరాల నిమిత్తం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్‌లోకి చేరాలని సీఎం సమక్షంలోనే కమిట్ అయినట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలు చేరినా, ఆ తర్వాత జాయినింగ్స్ స్పీడప్ కాలేదు. ఇక సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో పాత టీడీపీలో పనిచేసిన సీనియర్ లీడర్లందరితోనూ పార్టీ చర్చలు జరిపింది. 2014, 2018లో టీడీపీ బీ ఫాంపై గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన లీడర్లందరినీ కాంగ్రెస్‌లోకి గుంజాలని సీఎం స్వయంగా తనదైన శైలిలో చర్చలు జరిపినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది. కానీ అసెంబ్లీ సమావేశాలు, అమెరికా టూర్ బీజీలో సీఎం రేవంత్‌రెడ్డి ఉండటంతో ఆ టాస్క్ ముందుకు జరగలేదు. ఇప్పుడు సీరియస్‌గా తీసుకొని 2014, 2018లో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకు వెళ్లనున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 2/3 వంతు (26 మంది) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నది. ఢిల్లీ పెద్దల సలహాలు, సూచనల ప్రకారమే జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ లీడర్ తెలిపారు.