- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం టికెట్ కోసం ఫైట్.. రేణుకా చౌదరి వ్యాఖ్యలపై భట్టి సతీమణి స్పందన
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రోజురోజుకు ఎన్నికల్లో పోటీ చేయబోయే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. సోనియా గాంధీ పోటీ చేస్తే ఓకే.. లేకపోతే ఖమ్మం నాదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా.. రేణుకా చౌదరి కామెంట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని స్పందించారు. రేణుకా చౌదరి టికెట్ అడగడంలో తప్పులేదని అన్నారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. వాళ్లిద్దరు పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న తమరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతిమంగా టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ శనివారంతో ముగియనున్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే అప్లికేషన్లకు ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కేవలం 7 అప్లికేషన్లు రాగా, రెండో రోజు 34, మూడో రోజు ఏకంగా 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు వరకు 181 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజక వర్గాలకు అధికంగా దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌కు అతి తక్కువగా వచ్చాయి. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, భువనగిరి నుంచి తీన్మార్ మల్లన్నలు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్ గిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ వంటి కీలక నేతలు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారు.