BIG Breaking: యూట్యూబర్ హర్షసాయికి మరో బిగ్ షాక్..అతని ఫౌండేషన్ పై కేసు నమోదు

by Maddikunta Saikiran |
BIG Breaking: యూట్యూబర్ హర్షసాయికి మరో బిగ్ షాక్..అతని ఫౌండేషన్ పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్:యూట్యూబర్ హర్షసాయి(YouTuber Harshasai)కి మరో బిగ్ షాక్ తగిలింది.అతను చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.కాగా హర్షసాయిపై ఇప్పటికే అత్యాచారం కేసు(Rape Case) నమోదైన సంగతి తెలిసిందే. హర్షసాయి తనపై లైంగికంగా దాడి(Sexually Assaulted) చేశాడని ఓ యువతి నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో నార్సింగి పోలీసులు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా హర్షసాయిపై మరోకేసు నమోదయింది.అతని ఫౌండేషన్ పై రాచకొండ(Rachakonda) సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.తనను సహాయం పేరుతో రూ. 5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో హర్షపై 406,419,420,66-C, 66-D సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మ‌రోవైపు హ‌ర్ష‌సాయి అత్యాచారం కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌నంతటా తాను పోలీసుల‌కు లొంగిపోకపోతే హర్షసాయిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement

Next Story

Most Viewed