Big Alert : తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్

by M.Rajitha |
Big Alert : తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని విద్యార్థుల(Students)కు మరో బిగ్ అలర్ట్. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్(Exmas Schedule) విడుదల అయింది. 1 నుంచి 9వ తరగతి చదువున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల వార్షిక పరీక్షల(Annual Exams)కు తేదీలను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఏప్రిల్ 9న ఆన్యువల్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యి ఏప్రిల్ 17న ముగుస్తాయని తెలిపింది. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందివ్వనున్నట్టు తెలిపింది. ఇక రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ఒంటిపూట బడులు(Half Day School) మొదలు కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలలు నడవనున్నాయి. అయితే పదవ తరగతి పరీక్షలు నడుస్తున్న స్కూల్స్ లో మాత్రం మధ్యాహ్నం 1.30 నుంచి పాఠశాలలు కొనసాగనున్నాయి.

Next Story