ఫిలింనగర్‌లో తప్పిన పెనుప్రమాదం! రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌

by Ramesh N |   ( Updated:2024-03-30 08:34:19.0  )
ఫిలింనగర్‌లో తప్పిన పెనుప్రమాదం! రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఫిలింనగర్ పరిదిలోని షేక్‌పేట ద్వారకామయి నగర్‌లోని మెయిన్ రోడ్డు వద్ద కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు ఎగసిపడుతున్నాయి. కరెంటు వైర్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

కరెంటు స్తంభాలకు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో సుమారు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో కరెంటు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. స్థానిక ప్రజలు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed