- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSPతోనే బడుగులకు రాజ్యాధికారం : RSP
దిశ, తెలకపల్లి : బహుజన సమాజ్ పార్టీతోనే బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు రాజ్యాధికార సమానత్వం సాధ్యమని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం తెలకపల్లి మండలంలోని జమిస్తాపూర్, కారువంగా, నడిగడ్డ, గట్టురాయిపాకుల, గౌతంపల్లి, తెలకపల్లి, పెద్దపల్లి, బొప్పల్లి తదితర గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో బహుజనులదే రాజ్యాధికారమని ఆదరించి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే భూమిలేని ప్రతి రైతుకు ఎకరం భూమి ఇస్తామన్నారు. కఠిన రాజ్యాలు పోయి బహుజనుల రాజ్యం రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్, అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్, జిల్లా ఇన్చార్జ్ అంతటి నాగన్న, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రాములమ్మ, మహిళా నాయకులు మండల అధ్యక్షులు రెడ్డపాకుల శివశంకర్ జిల్లా, మండల, గ్రామాల బీఎస్పీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.