Bhatti Vikramarka: బోనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం:భట్టి

by Prasad Jukanti |   ( Updated:2024-07-28 08:02:03.0  )
Bhatti Vikramarka: బోనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం:భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పాల్గొన్న భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు భట్టికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క..బోనాలు భూమి పుత్రుల పండగ అని.. బోనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బోనాల పండగ ఘనంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఈ నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అన్ని వర్గాల ప్రజలు సామర్యంగా జీవిస్తున్న గొప్ప నగరం హైదరాబాద్. ఈ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అత్యంత సేఫ్టీ నగరంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed