Bhatti Vikramarka: ‘హైడ్రా’ సీఎం కోసమో.. మంత్రుల కోసమో తెచ్చింది కాదు: డిప్యూటీ సీఎం భట్టి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-07 11:04:25.0  )
Bhatti Vikramarka: ‘హైడ్రా’ సీఎం కోసమో.. మంత్రుల కోసమో తెచ్చింది కాదు: డిప్యూటీ సీఎం భట్టి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్‌ (Hyderabad)లో చెరువుల దుస్థితి ప్రజలందరికీ తెలుసని.. ఆ చెరువులు సీఎం, డిప్యూటీ సీఎం సొంత ఆస్తులు కావని భట్టి విక్రమార్క ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ (Hyderabad)లో ఇలానే ఆక్రమణలు కొనసాగితే చెరువులు కంటికి కూడా కనబడవని అన్నారు. అకారణంగా ఇళ్లను కూల్చడం ఎవరికీ ఇష్టం ఉండదని.. తప్పని పరిస్థితుల్లో చెరువులను కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ కోసం ఆక్రమణల కూల్చవేతలు కొనసాగుతున్నాయని.. గతంలో ఇదే కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) ఆక్రమణలను కూల్చుతామని స్టేట్‌మెంట్లు ఇవ్వలేదా అన్ని ప్రశ్నించారు.

చెరువుల పరిరక్షణ విషయంలో ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కానీ, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. ఆక్రమణల తొలగింపే కాదు.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైడ్రా (HYDRA)ను తెచ్చింది.. సీఎం (CM) కోసమో మంత్రుల కోసమో కాదని.. హైదరాబాద్ (Hyderabad) ఉనికిని కాపాడేందుకని అన్నారు. మూసీలో మంచి నీళ్లు లేకుండా పూర్తిగా డ్రైనేజీగా మార్చేశారని తెలిపారు. గతంలో ఇతర దేశాల్లోనూ కూడా నదులు డ్రైనేజీల్లా ఉండేవని.. వారు వాటిని ప్రక్షాళన చెపట్టి ఆస్తులుగా మార్చుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ (Hyderabad )లోని చెరువులు ముమ్మాటికీ ప్రజల ఆస్తి అని.. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే చెరువులు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా (HYDRA)ను తీసుకొచ్చామని భట్టి తెలిపారు.

ప్రజలకు మేలు జరగకూడదని ప్రతిపక్షాలు అజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ (Global City)గా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మూసీ సుందరీకరణ (Moosi Beautification)కు రూ.1.50 లక్షల కోట్లు అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయని.. ఇంకా టెండర్లు పిలవకుండానే అయ్యే ఖర్చును వారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరిపాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే తాము సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. అంతే కాని అవాస్తవాలు ప్రజలపై రుద్దడం సరికాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed