మూసీ నిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి

by M.Rajitha |
మూసీ నిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ(Musi) నిర్వాసితులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు. బుధవారం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసంపై భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులకు పట్టాలు లేకపోయినా వారికి అన్నిరకాల నష్ట పరిహారం అందిస్తామని ప్రకటించారు. మూసీ నిర్వాసితులను దూర ప్రాంతాలకు పంపకుండా, దగ్గర్లోనే ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా.. రెవెన్యూ అధికారులను గాని, కలెక్టర్లను గాని కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. వారి ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాల్సిందిగా కోరారు. ఆస్తిగా కాపాడుకోవాల్సిన మూసీని డ్రైనేజీగా మార్చి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నేడు పౌరసరఫరాల భవన్ లో ఖరీఫ్ ధాన్యం సేకరణ, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Advertisement

Next Story