- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీలాంచ్ పేరుతో భారీ మోసం.. భారతీ బిల్డర్స్ చైర్మన్, MD, CEO అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: భారతీ బిల్డర్స్ చైర్మన్ దుపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహా రావు అరెస్ట్ అయ్యారు. కొంపల్లిలోని భారతీ లేక్‌వ్యూ ప్రీలాంచ్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు రూ.80 కోట్ల వరకు వసూలు చేశారు. అతి తక్కువ ధరకే ప్లాట్లు అంటూ మొత్తం 350 మంది అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. అయితే, డబ్బులు అందినాక నిర్మాణం చేపట్టకుండా భారతీ బిల్డర్ నిర్లక్ష్యం చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ సంస్థ భారతీ బిల్డర్స్, ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహా రావులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తెలంగాణలో రియల్ ఏస్టేట్ వ్యాపారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రీ-లాంచ్ ఆఫర్లలతో అమయకులనే లక్ష్యంగా చేసుకొని భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇదంతా రోజూ పేపర్లలో, సోషల్ మీడియాలో వస్తున్నా బాధితుల్లో కూడా మార్పు రావడం లేదు.