నేటి నుంచే భారతీయ కళా మహోత్సవం 2024.. బొల్లారంలో ఎనిమిది రోజుల పాటు వేడుకలు

by Ramesh N |
నేటి నుంచే భారతీయ కళా మహోత్సవం 2024.. బొల్లారంలో ఎనిమిది రోజుల పాటు వేడుకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వేదికగా భారతీయ కళా మహోత్సవం 2024 నేటి నుంచి ప్రారంభమైంది. సందర్శకుల కోసం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో నుంచి ఆదివారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, జీవనశైలితో కూడిన కళలను ప్రదర్శించే ఈ అద్భుతమైన వేడుకలో హైదరాబాద్ ప్రజలందరూ పాల్గొనే అవకాశం కల్పించినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. కాగా, తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో భాగంగా నిన్న(శనివారం) భారతీయ కళా మహోత్సవ్ మోదటి ఎడిషన్‌ను సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ సహకారంతో రాష్ట్రపతి నిలయం నిర్వహిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed