- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bharat Biotech launches new oral vaccine : భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచంలో పెరిగిన కలరా!
దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ (OCV)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మేరకు హిల్ కాల్ పేరుతో ఓరల్ వ్సాక్సిన్‌ను తాజాగా విడుదల చేసింది. సింగపూర్‌కు చెందిన హిల్‌మాన్ లేబొరేటరీస్ లైసెన్స్‌తో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, భువనేశ్వర్‌లలో 200 మిలియన్ డోస్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
కలరా వ్యాప్తిని నిరోధించడానికి, టీకాలు ఉత్తమంగా ఉంటాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. 2021 నుంచి ప్రపంచంలో కలరా కేసులు, మరణాలు క్రమంగా పెరిగాయన్నారు. 2023 ప్రారంభం నుంచి ఈ ఏడాది మార్చి వరకు, 31 దేశాలలో 8,24,479 మందికి కలరా సోకగా, 5,900 మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. దాదాపు 31 దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు.