- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటికల్ స్ట్రాటజీ వెనుక జగన్ అనే ప్రచారం.. పొంగులేటి క్లారిటీ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన మాజీ ఎంపీ, ఖమ్మం నేత పొంగులేటీ పలు కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించడానికి ఏ పార్టీ సరైందో ఆ పార్టీలో చేరతానన్నారు. ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు ముట్టునివ్వను అనే కామెంట్ పై స్పందిస్తూ.. బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్కరిస్తున్నారన్నారు. వారే అసెంబ్లీ గేటు తాకనివ్వరని క్లారిటీ ఇచ్చారు. వారికి ప్రతినిధిగా తాను ఆ కామెంట్స్ చేశానన్నారు. దొరల గడీ నుంచి విముక్తి లభించిందన్నారు. ఏపీ సీఎం జగన్ తన రాజకీయ గురువు అని పొంగులేటి అన్నారు. ప్రజల అవసరాల కోసం కేసీఆర్‌ను కలుద్దామన్నా పట్టించుకోలేదన్నారు.
నాలుగేళ్లుగా కేసీఆర్ నాకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నన్ను పార్టీలో చేరాలని కోరుతున్నాయన్నారు. ఎవరికి ఎంత కమీషన్ ఇచ్చారో త్వరలో బీఆర్ఎస్ నాయకుల చిట్టా విప్పుతానన్నారు. పొంగులేటి వెనుక సీఎం జగన్ ఉన్నారనే అంశంపై స్పందిస్తూ.. తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్‌లో చేరానన్నారు. ఇప్పటికి జగన్ తో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఖమ్మం ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుతానని ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడినని తెలిపారు. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేశారన్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించిన వారితో తప్పకుండా చేతులు కలుపుతానన్నారు.