- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG BREAKING: సీఎం రేవంత్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
దిశ, వెడ్‌డెస్క్: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన తిరిగి సొంతగూటికి వెళ్లబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం జూపల్లి కృష్ణారావు హుటాహుటిన గద్వాలకు చేరుకుని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మరోసారి సమావేశం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడొద్దని, రానున్న రోజుల్లో పార్టీ సముచితం గౌరవం కల్పిస్తుందని మంత్రి ఆయనకు సర్దిచెప్పారు. అయితే, తాజాగా శుక్రవారం ఉదయం కృష్ణమోహన్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా, కృష్ణమోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పార్టీ మారుతున్నానని.. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని ప్రకటించ లేదు. అయితే, ఇవాళ సీఎం రేవంత్ భేటీతో కృష్ణమోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకుంటారా.. లేక బీఆర్ఎస్‌లోకి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.