ఫేక్ కాల్స్ పై జాగ్రతగా ఉండాలి : ఏసీబీ డీజీ విజయ్ కుమార్

by M.Rajitha |
ఫేక్ కాల్స్ పై జాగ్రతగా ఉండాలి :  ఏసీబీ డీజీ విజయ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏసీబీ అధికారుల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ చేస్తే శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయిని, క్రిమినల్ కేసులు కుడా నమోదు అవుతాయని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఏసీబీ అధికారులు పేరుతో నకిలీ కాల్స్ చేస్తున్నారని ఏసీబీ దృష్టికి వచ్చినట్లు శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పై కేసులు నమోదు చేయకుండా డబ్బు డిమాండ్ చేస్తూ వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. అలాంటి ఒక సంఘటనలో రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయబడినట్లు వెల్లడించారు. ఏసీబీ కార్యాయలం నుంచి అటువంటీ ఫోన్ కాల్స్ రావని ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ నమ్మకూడదని , అలాంటి నకిలీ కాల్ చేసేవారికి చెల్లింపులు చేయకూడదని తెలిపారు. ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ వస్తే, వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించాలని తెలిపారు.

Next Story