BB Patil: రాజ్యసభ ఛాన్స్ ఇవ్వండి.. హై కమాండ్‌కు బీబీ పాటిల్ రిక్వెస్ట్

by Shiva |
BB Patil: రాజ్యసభ ఛాన్స్ ఇవ్వండి.. హై కమాండ్‌కు బీబీ పాటిల్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ హైకమాండ్‌ను రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇందు కోసం ఆయన కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి, అగ్ర నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించి పోటీకి ఎంతోమంది బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు. ఈటల రాజేందర్ కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచినట్లు ప్రచారం జరిగింది. కానీ, చివరికి బీజేపీ బీబీ పాటిల్‌ను బరిలో దింపగా.. ఆయన 4,82,230 ఓట్లు సాధించారు. అయినా, కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షట్కర్ చేతిలో 46,188 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అప్పటి నుంచి ఆయన సెగ్మెంట్‌కు కూడా ఎక్కువగా వెళ్లడం లేదని చర్చ జరుగుతోంది.

అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు

బీబీ పాటిల్ పోటీ చేసిన జహీరాబాద్ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రను కలిపే సెగ్మెంట్ అది. ఆయనకు మూడు రాష్ట్రాలకు చెందిన కీలక పొలిటికల్ లీడర్లతో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయన తన రాజ్యసభ పదవి కోసం ఇన్‌ఫ్లూయెన్స్‌న వాడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. గడ్కరీతో మంచి అనుబంధం ఉన్న పాటిల్.. పార్టీ అగ్ర నేతలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆయన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed