- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Basara IIT: వీడని మిస్టరీ.. ఐఐటీ విద్యార్థిని ఎందుకు సూసైడ్ చేసుకుంది..?
దిశ, వెబ్‌డెస్క్: బాసర ఐఐటీ విద్యార్థిని మృతి మిస్టరీ ఇంకా వీడడం లేదు. తమ కుమార్తె ర్యాగింగ్ వల్లే చనిపోయిందని తల్లిదంద్రుడు ఆలోపిస్తున్నారు. తమ కుమార్తె సూసైడ్ నోట్ బయటపెట్టాలని కోరుతున్నారు. స్వగ్రామం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం, లింగంపల్లిలో స్వాతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైూపు సెక్యూరిటీ గార్డ్ దాడిలో గాయపడ్డ ఏబీవీపీ కార్యకర్త సాయికుమార్ ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ ఏరియాలోని మున్సిపల్ 7 వార్డ్ తిరుమల కాలనీకి చెందిన పూరి రవీందర్-ఉజ్వల దంపతుల కూతురై, బాసర త్రిబుల్ ఐటీలో పియుసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ (18) నిన్న (ఆదివారం) రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె సూసైడ్ చేసుకోవడంతో కలకలం రేగింది.
బాసర నుంచి దసరా దీపావళి పర్వదినాల సమయాల్లో కూడా స్వాతి ప్రియ ఆర్మూర్ లోని పెర్కిట్ కి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉందని, వారి కుటుంబం ఇటీవల కొనుగోలు చేసిన స్కూటీపై కూడా స్వాతి ప్రియ డ్రైవింగ్ చేసిందని ఆ ఏరియా కాలనీవాసులు తెలిపారు. కానీ స్వాతి ప్రియ ఇంటికి తాళం వేసి ఉండటంతో పూర్తి వివరాలు తెలియలేదు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం వ్యక్తిగత కారణాలతోనే స్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది.
మరోవైూపు సెక్యూరిటీ గార్డ్ దాడిలో గాయపడ్డ ఏబీవీపీ కార్యకర్త సాయికుమార్ ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి తలపై బలమైన గాయాలు తగలడంతో అతడికి చాలా రక్తస్రావమైంది. దీంతో జీజీహెచ్‌లో ఆపరేషన్ నిర్వహించగా ఇంకా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.