- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: హైదరాబాద్‌లో బర్రెలక్క అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన బర్రెలక్క అలియాస్ శిరీష అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై నిరుద్యోగ జేఏసీ, పలు విద్యార్థి సంఘాలు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద బర్రెలక్క ఆందోళనకు దిగారు. టీజీపీఎస్సీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తనను అరెస్ట్ చేయడం ఏంటని పోలీసుల తీరుపై మండిపడ్డారు.
తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందని బర్రెలక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా, నిరుద్యోగుల ముట్టడి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుండి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి ఆందోళనకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎక్కడికక్కడే నిరుద్యోగులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.