కవిత వాచ్‌కి ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదా? (వీడియో)

by GSrikanth |
కవిత వాచ్‌కి ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదా? (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మహిళలపై నిత్యం దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి కనీసం మహిళల భద్రతపై సమీక్ష కూడా నిర్వహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రోజుకో రేప్, పూటకో మర్డర్ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ సోమవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక్కరోజు దీక్షలో బండి సంజయ్ మాట్లాడారు. మెడికో ప్రీతి కేసును నీరుగార్చి నిందితుడు సైఫ్‌ను హీరోను చేసేందుకు కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని వాళ్ళ అమ్మ నాన్న చెబుతున్నారని, చనిపోయిన ప్రీతి డెడ్ బాడీకీ నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వానిదని మండిపడ్డారు.


చనిపోయిన ప్రీతి ఫోన్‌ను పోలీసులు ఓపెన్ చేసి వాట్సాప్ చాట్ అంతా డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకువస్తామని యూపీ తరహాలో మహిళ మీద అఘాయిత్యాలు చేసే వారి ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రీతి చనిపోతే పది లక్షల రూపాయల పరిహారం ఇచ్చారని అదే కవిత చేతి వాచ్ ఖరీదు రూ.20 లక్షలు అన్నారు. కేసీఆర్ బిడ్డ చేతి వాచ్‌కు ఉన్న విలువ కూడా తెలంగాణ మనుషుల ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. రేపిస్టులంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని, బీఅర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రేప్ చేసిన వారికి రికార్డ్ ప్రకటిస్తారేమో అని ధ్వజమెత్తారు. డ్రగ్స్ తీసుకునే తీసుకునే ట్విట్టర్ టిల్లు అయిన రోడ్డు మీద తిరిగే రోమియో అయినా బీజేపీ ప్రభుత్వంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. మాటలే కానీ చేతలు లేని సీఎం కేసిఆర్‌ను పదవి నుంచి పీకేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు.


Advertisement

Next Story