Bandi Sanjay: మహిళల పాత్రను పెంపొందించే పథకాల నిధులపై బడ్జెట్‌పై బండి ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
Bandi Sanjay: మహిళల పాత్రను పెంపొందించే పథకాల నిధులపై బడ్జెట్‌పై బండి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అదనంగా 3 కోట్ల ఇండ్లకు ప్రకటన విడుదల అయిందని, నిధుల కేటాయింపులు చేశారని తెలిపారు. మహిళల నేతృత్వంలో ఆర్థికాభివృద్ధిలో బాలికలు, మహిళల పాత్రను పెంపొందించే పథకాలకు బడ్జెట్ లో రూ.3 లక్షల కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్‌‌లో కేటాయింపు జరిగాయన్నారు.

ప్రధాన మంత్రి జన జాతియా ఉన్నత్ గ్రామ్ అభియాన్- దేశంలోని గిరిజన సమాజం సామాజిక- ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 63,000 గ్రామాలను కవర్ చేయడం ద్వారా 5 కోట్ల గిరిజన ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story