Bandi Sanjay యాత్ర: నేడు హైకోర్టు తీర్పు

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-28 10:48:07.0  )
Bandi Sanjay యాత్ర: నేడు హైకోర్టు తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్ పాదయాత్ర అనుమతి నిరాకరణపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కాగా నిర్మల్ పోలీసులు కావాలనే అనుమతి నిరాకరించారని హైకోర్టులో బండి సంజయ్ తరపున పిటిషన్ వేశారు. వారం క్రితం అనుమతి ఇచ్చి ఇవాళ కావాలనే అనుమతి రద్దు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంలో సోమవారం మధ్యాహ్నం వరకు బండి సంజయ్ పాదయాత్ర, బహిరంగ సభకు సంబంధించి తీర్పు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. భైంసా సున్నితమైన ప్రాంతమని, శాంతిభద్రతల సమస్య దృష్ట్యా అనుమతి లేదని నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Read More...

'దిశ' స్పెషల్ ఇంటర్వ్యూలో సంచలనాలు బయటపెట్టిన Bandi Sanjay

భైంసా వెళ్లాలంటే వీసా కావాలా? బండి సంజయ్ ఫైర్

Advertisement

Next Story