- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటల రాజేందర్‌తో విభేధాలపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
దిశ, కరీంనగర్ బ్యూరో: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ నియంత పాలనను వ్యతిరేకించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునేవాళ్లంతా బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్‌తో విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గురువారం కరీంనగర్‌లో బండి సంజయ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సంజయ్మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ విషయంలో మీడియా ఎన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసినా, ఎన్ని విబేధాలు సృష్టించాలనుకున్నా నెరవేరదని అన్నారు. మేమంతా ఒక్కటే, మా అందరి లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని స్థాపించడమే మా ధ్యేయమని అన్నారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ సహా పార్టీ నేతలు ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.
పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం..
కరీంనగర్‌లో గత 7 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. పంచాయితీ కార్యదర్శుల సమ్మె పూర్తిగా న్యాయబద్ధమైదని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో, కేంద్ర మరియు రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్రానికి అనేక అవార్డులు రావడం వెనుక పంచాయతీ కార్యదర్శుల శ్రమ ఉంది బండి సంజయ్ అన్నారు. నా వల్లనే అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాస ఘాతకుడని అన్నారు. తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి చదివిస్తే కష్టపడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరితే ప్రొబేషనరీ పేరుతో నాలుగేళ్లు జాప్యం చేయడం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీ వేదికగా జూనియర్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. పంచాయతీ కార్యదర్శులకు బీజేపీ అండగా ఉంటుందని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి అన్యాయం జరిగినా తాము వారి తరుపున పోరాటం చేస్తామని సంజయ్ హమీ ఇచ్చారు.