కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ కీలక హామీ

by GSrikanth |
కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అధిష్టానానికి తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులు కృతజ్ఞతలు చెప్పారు. శనివారం తొలి జాబితాలో అవకాశం దక్కిన అందరూ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నా జీవితం కరీంనగర్ ప్రజలకు అంకితం చేస్తానని అన్నారు. ప్రజల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తానని మాటిచ్చారు. ఈ సారి కేంద్రం నుంచి రెట్టింపు నిధులు తీసుకొచ్చి రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఊహించని రీతిలో కరీంనగర్‌ను తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. అనంతరం మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, అమిత్ షాకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలోని 17కు 17 నియోజకవర్గాల్లో గెలుస్తామని ఈటల ధీమా వ్యక్తం చేశారు. అనంతరం భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ హైకమాండ్‌కు థ్యాంక్స్ చెప్పారు. తమ మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిన అధిష్టానానికి.. గెలిచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు.

Advertisement

Next Story