- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అసెంబ్లీలో తప్పుడు ప్రచారం చేయాలని KCR చూస్తున్నాడు'
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఎనిమిదేళ్లలో ఇంత అప్పు చేస్తారా అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో తెలంగాణలో పుట్టబోయే ప్రతి బిడ్డపై లక్ష రూపాయల భారం పడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే బయటపెట్టారని అన్నారు. బడ్జెట్‌లో లేని రుణాలు, పన్ను చెల్లింపుల భారం తడిసిమోపెడు అవుతున్న వైనం బట్టబయలు చేశారని చెప్పారు. అప్పులు చేసినా రాష్ట్రం మాత్రం అభివృద్ధి చెందలేదని తాజాగా అసెంబ్లీ వేదికా ఎఫ్ఆర్ బీఎం రుణపరిమితులపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికాగ నిర్మలా సీతారామన్ గతంలో మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు. కాగా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేల ప్రణాళికలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు చేశారు.
Read More: కీలక సమావేశానికి ఏపీ ఆర్థికశాఖ మంత్రి హాజరు.. హరీశ్ రావు గైర్హాజరు
Read More: గ్లోబల్ లీడర్‌ల జాబితాలో Narendra Modi మళ్లీ అగ్రస్థానం