- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవటమే బీజేపీ లక్ష్యం: బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: చంపాపేట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవటమే బీజేపీ లక్ష్యమని అన్నారు. 'తెలంగాణ కాషాయ అడ్డ' అని నినదించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామని సంచలన ప్రకటన చేశారు. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. పాతబస్తీలో హిందువుల 'ఘర్ వాపసీ' కార్యక్రమం మెదలుపెడతామని అన్నారు. భాగ్యనగరానికి ఐకాన్‌గా భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని పునర్:నిర్మాణం చేస్తామని తెలిపారు. ఒకప్పుడు పాతబస్తీ హిందులకు అడ్డా అని, ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలామంది బయటకు వెళ్ళిపోయారని గుర్తుచేశారు.
హైదరాబాద్ పార్లమెంట్‌ను బీజేపీ ఎందుకు గెలవదో చూద్దామని కార్యకర్తల్లో జోష్ నింపారు. అంతేగాక, యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటని ప్రశ్నించారు. ముస్లిం ఆడ బిడ్డల జీవితాన్ని ఆగం చేస్తున్న ట్రిపుల్ తలాక్‌ను మోడీ రద్దు చేశాడని, ఈ నిర్ణయంతో యూపీలో ప్రధానికి ముస్లిం ఆడ బిడ్డలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.