- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bandi Sanjay: అలా చేస్తే కేంద్రం నుంచి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వం.. సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపు నాలుగు కొత్త పథకాలను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ (Telangana Government) సమయత్తమవుతోంది. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇచ్చే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ (Indiramma) పేరు పెడితే కేంద్రం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వదని స్పష్టం చేశారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (Pradhan Manthri Aavas Yojana) పేరు పెడితేనే రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు (New Ration Cards)లపై కాంగ్రెస్ పార్టీ (Congress) ఆనవాళ్లు ఉండే ఫొటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమని అన్నారు. అవసరం అయితే తామే స్వయంగా రేషన్ కార్డులను (Ration Cards) ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని బండి సంజయ్ అన్నారు.