- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్.. శుభాకాంక్షలు తెలిపిన CM కేసీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. శాసనమండలికి జరిగిన డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం మండలి డిప్యూటీ చైర్మన్‌గా ప్రకాశ్ ఎన్నికయ్యారు. శాసనమండలి వేదికగా బండ ప్రకాశ్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ చైర్మన్ సీటులో కూర్చోబెట్టారు. కాగా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ పేరును శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాష్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ పదవికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ నియమితులయ్యారు. బండ ప్రకాశ్‌కు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలిలో విపక్ష నేత జీవన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందించారు.