- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balmoor Venkat: గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే చేయలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ
దిశ, డైనమిక్ బ్యూరో: నిజాం కాలేజీలో ధర్నా చేస్తున్న యూజీ విద్యార్ధులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కలిశారు. వారి సమస్యను అడిగి తెలుసుకొని, నిజాం కళాశాల ప్రిన్సిపాల్ తో సమావేశం అయ్యి.. విద్యార్ధుల సమస్యపై చర్చించారు. అనంతరం బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ లో 280 విద్యార్ధులకు సరిపడా హాస్టల్ ఫెసిలిటీ ఉన్నదని, ఇందులో హాస్టల్ మొత్తం తమకే కేటాయించాలనీ యూజీ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తుండగా.. పీజీ విద్యార్థులు 50 శాతం హాస్టల్ తమకు కేటాయించాలని కోరుతున్నారని అన్నారు. సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ కి మరో రెండు ఫ్లోర్ లు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.
గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఈ సమస్య పరిష్కారం కాలేదని, గత ఐదారేళ్ల నుండి బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పింది తప్ప చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూజీ విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఎక్సిస్టింగ్ బిల్డింగ్ లేదా 2 ఫ్లోర్స్ నిర్మాణం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని, బడ్జెట్ కి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడుతామని చెప్పారు. అంతేగాక ఇన్‌ఛార్జ్ వీసీ దాన కిషోర్, రిజిస్టర్ తో కూడా మాట్లాడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్దులకు, బల్మూరి వెంకట్ హామీ ఇచ్చారు.