- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బలగం’ మొగిలయ్యకు సర్కారు ఆపన్న హస్తం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కిడ్నీలు ఫెయిల్ఐన ‘బలగం’ మొగిలయ్యకు సర్కారు అండగా నిలిచింది. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మంత్రి కేటీఆర్ వైద్య సహాయ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారు. ఎల్‌వోసీ ప్రయత్నాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వ పథకం వర్తింపజేసేందుకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంరవ్వ, మొగిలయ్య దంపతులను ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సూచించారు. రెండు రోజుల్లో నిమ్స్ కు బలగం మొగిలయ్యను తరలించనున్నారు. ఇప్పటికే బలగం డైరక్టర్ వేణు యెల్ధండి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. త్వరలోనే దిల్ రాజు ప్రోడక్షన్ నుంచి ఆర్థిక సాయం అందనుంది. ఉచితంగా డయాలసిస్, ఉచితంగా మందులు అందించాలని కేటీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.