''ఎవడబ్బ నీళ్లని ఎత్కపొమ్మంటున్నవ్''.. కేసీఆర్‌పై బక్క జడ్సన్ తీవ్ర ఆగ్రహం

by Satheesh |   ( Updated:2023-02-08 14:08:51.0  )
ఎవడబ్బ నీళ్లని ఎత్కపొమ్మంటున్నవ్.. కేసీఆర్‌పై బక్క జడ్సన్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'ఎవడబ్బ నీళ్లని ఎత్కపొమ్మంటున్నవ్' అంటూ కాంగ్రెస్​ సీనియర్ ​నేత బక్క జడ్సన్ ​సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హారాష్ట్రకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధమని ఎలా చెబుతావని మండిపడ్డారు. తెలంగాణ నీ ఒక్క కుటుంబానిదేనా? అంటూ ఫైర్ ​అయ్యారు. బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని శ్రీరాం సాగర్ నీళ్లు ఎత్తుకు పోతే 16 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదన్నారు. ఇదంతా తెలిసినా కేసీఆర్.. నాందేడ్​ సభలో రాష్ట్రానికి నష్టాన్ని చేసే విధంగా ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటనకు ఆయన బుధవారం జలసౌదా ముందు ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాం సాగర్ సాగునీటి ప్రాజెక్ట్ అని, సరస్వతి, లక్ష్మి, కాకతీయ మూడు కాల్వలు కలిగిన దీని ద్వారా సుమారు 35 మెగా వాట్‌ల కరెంటు ఉత్పత్తి చేయడమే కాకుండా, తెలంగాణలో 16 లక్షల ఎకరాలు నీరు లభిస్తుందన్నారు. మహారాష్ట్రకు ఈ నీళ్లు తరలిస్తే ఉత్తర తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాదు, ఖమ్మం, సూర్యాపేట ప్రాంతాల్లోని 16 లక్షల ఎకరాలు ఎడారిగా మారిపోతాయన్నారు. నీళ్లు తరలించే ప్రక్రియను మానుకోవాలని లేదంటే ప్రగతిభవన్ ​ముందు తెలంగాణ ప్రజలంతా ధర్నాకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మ్ షాకీర్, కేకేసీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి అయిత గిరి బాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read...

ప్రగతి భవన్‌ను కూల్చాల్సిందే: రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed