బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో 8 మందికి బెయిల్

by Satheesh |   ( Updated:2023-05-12 12:11:47.0  )
బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో 8 మందికి బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని ఎనిమిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని నిందితులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నిర్దేశించిన తేదీల్లో వారి ఎదుట విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ కేసులో కీలక నిందితురాలు అయిన రేణుకకు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా మరో ఎనిమిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఎవరూ మోసపోవొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్

Advertisement

Next Story