ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు బెయిల్ నిరాకరణ

by GSrikanth |   ( Updated:2023-02-16 10:16:39.0  )
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు బెయిల్ నిరాకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు షాక్ ఇచ్చింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వీరందరిపై కీలకమైన ఆధారాలను ఈడీ అధికారులు కోర్టు ముందు ఇదివరకే ఉంచారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు మనీ లాండరింగ్ వ్యవహారంలో నమోదైన కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. కాగా ఈ కేసులో ఈడీ, సీబీఐ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును స్పీడప్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు రాజకీయ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story