TS: నేటి నుంచి ఇంటింటికీ అయోధ్య అక్షింతలు

by GSrikanth |   ( Updated:2023-12-31 15:05:43.0  )
TS: నేటి నుంచి ఇంటింటికీ అయోధ్య అక్షింతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఈనెల 22వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన అక్షింతలను తెలంగాణలో ప్రతి ఇంటికీ పంపించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు పండరీనాథ్, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు విస్తృత జనసంపర్క్ అభియాన్ పేరిట శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తెలిపారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పల్లె, ప్రతి పట్టణం నుంచి ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, తండా, గ్రామం, పట్టణం, నగరం, మహానగరాల్లో సైతం అక్షింతలు పంపిణీ చేయనున్నట్లు వారు వెల్లడించారు.

Read More..

బిగ్ అలర్ట్.. అయోధ్య రాముడి పేరుతో కొత్త మోసం..

Advertisement

Next Story