Biryani Center: అదిరే ఆఫర్‌తో పెరిగిన గిరాకీ! బిర్యానీ సెంటర్ నిర్వహకులపై దాడి

by Ramesh N |   ( Updated:2025-03-15 18:42:51.0  )
Biryani Center: అదిరే ఆఫర్‌తో పెరిగిన గిరాకీ! బిర్యానీ సెంటర్ నిర్వహకులపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిర్యానీ సెంటర్ (Biryani Center) నిర్వాహకులపై దాడికి యత్నించారు. సికింద్రాబాద్-మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బిర్యానీ సెంటర్‌లో ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ బిర్యాని సెంటర్‌లో అన్ లిమిటెడ్ ఫుడ్ అంటూ ఆఫర్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ ప్రయత్నానికి మంచి ఫలితం రావడంతో భారీగా కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఇక బిర్యాని సెంటర్ బాగా నడుస్తుందని స్థానిక నాయకులు మూడు లక్షలు డిమాండ్ చేశారు. అందుకు యాజమాన్యం నిరాకరించడంతో వంట సామగ్రిని కిందపడేసి, బిర్యాని సెంటర్ నిర్వహకులపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు హోటల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

READ MORE ...

చిన్న పాటి గొడవ.. ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారితీసింది..

అన్నా, చెల్లెలను కూడా చెడుగా చూస్తున్నారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Next Story