బ్రేకింగ్: బావను హత్య చేసినందుకు మరదలికి సన్మానం..

by Rajesh |   ( Updated:2023-02-14 08:37:54.0  )
బ్రేకింగ్: బావను హత్య చేసినందుకు మరదలికి సన్మానం..
X

దిశ, మరిపెడ (డోర్నకల్ ): రోజురోజుకి మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. తన మన అనే తేడా లేకుండా ఎవరి స్వార్థం వారిదే‌.. అవసరమైతే కట్టుకున్న భర్త అభం శుభం తెలియని పసిపాపలని సైతం సైతం వారి స్వార్ధ అక్రమ సంబంధాలకు బలి చేస్తున్నారు.

ఈనెల 10వ తేదీన డోర్నకల్ పట్టణ కేంద్రంలోని శివాలయం వెనుక కుళ్ళిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం కలకలం రేపింది. అమానుషంగా హత్య చేసి ఆపై శరీరాన్ని కాల్చడంతో గుర్తుపట్టలేనంతగా ఆ శవం ఉన్నది. అయితే స్థానిక సిగ్నల్ తండా‌కు చెందిన జగన్ కనపడకపోవడంతో అనుమానం వచ్చి తండావాసులు ఓ మహిళని నిలదీయగా అసలు కథ తెలిసింది.

అసలేం ఎం జరిగింది?

డోర్నకల్ శివారులోని సిగ్నల్ తండాలో నివసించే భానోతు జగన్ తన మరదలైన బానోత్ సుభద్ర కారేపల్లికి చెందిన వీరన్న అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ని ప్రవర్తన సరిగా లేదు తీరు మార్చుకో అని మందలించాడు. మన కుటుంబం పరువు పోతుంది అంటూ చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ తీరు మార్చుకొని సదరు మహిళ వీరన్న వారి మిత్రులతో కలిసి జగన్ నమ్మించి ప్లాన్ ప్రకారం హత్యకు పాల్పడింది. నిందితురాలు పెద్దమనుషుల, తండావాసుల సమక్షంలో నేరం ఒప్పుకుంది. ఆగ్రహించిన తండావాసులు ఆమెకు దేశుద్ధి చేసి మెడలో చెప్పుల దండలు వేసి తండాలో ఊరేగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Crime News: చిక్కడపల్లిలో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య

Advertisement

Next Story

Most Viewed