- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైడ్రాకు భారీగా స్పెషల్ పోలీస్ సిబ్బంది
దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా (HYDRA)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad) జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా కమిషన్ కు ప్రభుత్వం మరింత భారీ భద్రతను ఏర్పాటు చేసింది. హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులను ప్రత్యేకంగా కేటాయించింది. అయితే గత ఆదివారం మాదాపూర్ పరిధిలోని సున్నపుచెరువు వద్ద అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా కొంతమంది స్థానికులు హైడ్రా అధికారులపై దాడులు చేయగా.. పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం... హైడ్రా అధికారులకు మరింత భద్రత పెంచుతూ ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.