- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly Sessions: అధ్యక్షా..! ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 23న శాసనసభ మూడవ సెషన్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. 24న శాసనమండలి సమావేశాలు స్టార్ట్ అవుతాయని గురువారం గవర్నర్ రాధాక్రిష్ణన్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి రోజు అసెంబ్లీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్యనందితకు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపు కావడంతో గవర్నర్ స్పీచ్ ఉండదు. 23న సాయంత్రం బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అదే విధంగా కేంద్రం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ కు తుదిరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. 24న శాసనసభలో సాధారణ అంశాలు, బిల్లులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా విధివిధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన అంశాలను చర్చించి, విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. 25న పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అంతకు ముందు అసెంబ్లీ కమిటీ హాల్ లో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులను బట్టి వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపొందిస్తున్నట్లు భట్టి ఇప్పటికే ప్రకటించారు.
ఎక్కువ బడ్జెట్ పెంచి ప్రజలపై ధరలు మోపబోమని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెలాఖరు వరకు కంటిన్యూ చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, ధరణి, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నంతో పాటు పలు అంశాలపై చర్చించి ప్రభుత్వం తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఎన్నిబిల్లులు, ఏయే బిల్లులు ప్రవేశపెడతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగు నెలల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.75లక్షల కోట్ల ఓటాన్ బడ్జెట్ ను అసెంబ్లీలో ఆమోదించారు. అయితే ఇప్పుడు రాష్ట్రస్థాయి పూర్తి బడ్జెట్ ఎంత ఉంటుందనేది హాట్ టాఫిక్ గా మారింది.