క‌ళ‌ల‌ కాణాచి తెలంగాణ‌.. : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

by Rajesh |
క‌ళ‌ల‌ కాణాచి తెలంగాణ‌.. : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కళలకు కాణాచిగా ఉంద‌ని, జానపద కళలు, శాస్త్రీయ కళలు, సంగీతం, నృత్యం హైదరాబాద్ దక్కనీ కళారూపాలు ఎన్నో తెలంగాణలో విలసిల్లుతున్నాయని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ర‌వీంద్రభార‌తీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజా రెడ్డి ప్రద‌ర్శించిన కాకతీయం 3వ భాగం నృత్య రూప‌క కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాకతీయులు ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, కళా రూపాలను, క‌ళాకారుల‌ను పోషించారని, అందులో పేరిణి నాట్యం కూడా ఒక‌ట‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం కళలు, సంస్కృతి, సాహిత్యంలో అభివృద్ధి కోసం కృషి చేస్తుంద‌ని, క‌ళాకారులను ప్రొత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed