కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటీ? : ఈటల

by Sathputhe Rajesh |
కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటీ? : ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. సంజయ్ అరెస్ట్ ను బీజేపీ అగ్ర నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బండి అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లాక కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే బండి అరెస్ట్ ను ఈటల ఖండించారు. ఒక ఎంపీని కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని మండి పడ్డారు. బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed