చెల్లెలితో గొడవ.. తల్లిదండ్రులు మందలించారని..

by Sathputhe Rajesh |
చెల్లెలితో గొడవ.. తల్లిదండ్రులు మందలించారని..
X

దిశ, కామారెడ్డి రూరల్ : చెల్లెతో ఇంట్లో గొడవ పడడంతో అన్నను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన అన్న ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. బాలుడు కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన 14 ఏళ్ల మణికృష్ణ తన ఇంట్లో చెల్లెలితో ఆడుకుంటూ గొడవపడ్డాడు.

గమనించిన తల్లిదండ్రులు మణికృష్ణను మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన మణికృష్ణ మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయినా మణికృష్ణ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో మణికృష్ణ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed