- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ రెడ్డి, కేసీఆర్ ఆ నీళ్లు తాగినవాళ్లు కాదా?.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ లో ఎవరైనా పీసీసీ అడగొచ్చని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో ఆ స్వేచ్ఛ ఉండదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ లపై ఫైర్ అయ్యారు. జవహర్ లాల్ నెహ్రు 40 కోట్ల దేశ జనాభాకు తినడానికి తిండి లేని రోజుల్లో దేశ ప్రజల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారని తెలిపారు. నెహ్రూ ప్రధాని అయినప్పుడు దేశంలో కరెంట్, ప్రాజెక్టులు లేవని, అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు కట్టే పని పెట్టుకున్నారని అన్నారు. మన దగ్గర శ్రీశైలం, నాగార్జున సాగర్ కట్టి.. కరెంట్ ఉత్పత్తి కూడా మొదలుపెట్టారని, నెహ్రు దూరపు చూపు తో ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసి.. ధాన్యం నిల్వలకు నాంది పలికింది ఆయనేనని, పారిశ్రామిక రంగాన్ని కూడా నెహ్రు ప్రోత్సహించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఆర్ఎస్పీ, మంజీరా, సింగూరు లాంటి ప్రాజెక్టులు కట్టారని, మోడీ పదేళ్ళలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారని కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ మంజీరా, సింగూరు నీళ్లు తాగినవాల్లేనని, ఇవి వాస్తవం కాదా..? కాంగ్రెస్ ఈ ప్రాజెక్టు లు కట్టలేదు అని చెప్పగలరా..? ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ 70 ఏండ్లలో ఏం చేశిందని అంటున్నారని.. విశాఖ ఉక్కు తెచ్చింది మేము అయితే అమ్మకానికి పెట్టింది మాత్రం మోడీ అని, బీజేపీ నేతలు ఎన్ని కంపెనీలు పెట్టారు.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పగలిగే దమ్ముందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అంతా మేమే పెంచినం అని మాట్లాడుతున్నారని.. 60 ఏండ్లు పాలించిన వాడు ఏం చేయకుండానే ఈయన చేశాడా..? అని మండిపడ్డారు. ఇక పీసీసీ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని, దానిలో తప్పేముందని.. బీజేపీ లో పదవులు అడిగితే.. ఉన్న పదవి పోతుందని, అదే బీఆర్ఎస్ లో అసలు పదవి అడిగే పరిస్థితి కూడా ఉండదని, కానీ కాంగ్రెస్ లోనే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ లు ఎవరైనా ఢిల్లీకి వెళ్లి పదవి అడిగే స్వేచ్ఛ ఉందని జగ్గారెడ్డి అన్నారు.