- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేమేమైనా నక్సలైట్లమా.. సీఎం కేసీఆర్‌పై రఘునందర్ రావు ఫైర్
దిశ, కామారెడ్డి : కేసీఆర్.. కామారెడ్డి ప్రజలు గజ్వేల్ అభివృద్ధి చూడటానికి వస్తామంటే భయమెందుకు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో రఘునందన్ రావు బిచ్కుందకు వెళ్లారు. రమణారెడ్డిని విడిపించుకుని కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డికి వేలాది మంది బీజేపీ శ్రేణులు భారీ స్థాయిలో ఘనస్వాగతం పలికారు.
దేవునిపల్లి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీ ద్వారా నిజాంసాగర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. చౌరస్తాలో బహిరంగ సభలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. భద్రత మాదే.. బాధ్యత మాదే అని చెప్పే పోలీసులు రమణారెడ్డి ఏం తప్పు చేస్తే అరెస్ట్ చేశారో జిల్లా ఎస్పీ చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి చూడాలని అందుకోసం బస్సులు తామే ఏర్పాటు చేస్తామని మహారాష్ట్రలో చెప్పిన కేసీఆర్ కామారెడ్డి నుంచి గజ్వేల్ అభివృద్ధి చూడటానికి వస్తామంటే ఎందుకు భయపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రమణారెడ్డి ఏమైనా తుపాకులు పట్టుకుని వస్తా అన్నాడా.. మేమేమైనా నక్సలైట్లమా.. నిషేధిత వ్యక్తులమా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వస్తామన్నామా.. ఎకరాకు కోటి రూపాయలు ఎలా సంపాదించాలని అడిగామా.. అని నిలదీశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక శాసనం రాసుకోవాలని, 10 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో మీ నలుగురే పోటీ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ వేయడానికి వెళ్లే మమ్మల్ని పోలీసులను పెట్టి అడ్డుకోండన్నారు.
నాడు ఆంధ్రుల పాలనలో కూడా ఇలాంటి నిర్బంధాలు జరగలేవన్నారు. ఎస్పీగారు. సిద్ధంగా ఉండండి.. కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడించి తీరతారు.. అప్పుడు మీరే ప్రత్యేక ఎస్కార్ట్ పెట్టి కేసీఆర్‌ను ఫార్మ్ హౌస్‌లో వదిలిపెట్టండని ఎద్దేవా చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రమణారెడ్డిని కార్యకర్తల సహకారంతో విడిపించుకున్నామన్నారు. ఇకపై బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే కామారెడ్డిలో జరిగినట్టే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జమిలి ఎన్నికలు భారత ప్రభుత్వానికి కొత్త ఏమి కాదని, 2014 లో కూడా జమిలి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. ఇప్పటికే దీనిపై రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేశారన్నారు. సభ ముగింపు అనంతరం మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి, బాన్సువాడ నాయకులు మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.