తెలంగాణలో మరో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

by Bhoopathi Nagaiah |
తెలంగాణలో మరో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు గవర్నర్ ఆమోదం తెలుపారు. వీటి ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఇప్పటికే న్యాయశాఖ కార్యదర్శి గెజిట్ విడుదల చేయగా, ఉన్నత విద్యాశాఖ జీఓ విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు కథ అనేక మలుపులు తిరిగింది. మొదట బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి, అప్పటి గవర్నర్ తమిళసై అనుమతి కోసం పంపగా... బిల్లులో లోపాలు ఉన్నాయని ఫైల్ పక్కన పెట్టేశారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా, తనవద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని తెలియజేశారు. తర్వాత ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించారు. తర్వాత ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారి, గవర్నర్ కూడా మారారు. మార్చిలో రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన రాధాక్రిష్ణన్ గత జూలైలో బిల్లుకు ఆమోదం తెలుపుతూ సంతకం చేయగా, ఇప్పుడు న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం శ్రీనిధి(ఘట్ కేసర్), గురునానక్(ఇబ్రహీంపట్నం), ఎంఎన్ఆర్(సంగారెడ్డి), కావేరీ(వర్గల్), నిక్మార్(శామీర్పేట) విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య 10 కి పెరగనుంది.

Advertisement

Next Story

Most Viewed