Breking News : కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం ఇక మహా సులభం

by M.Rajitha |
Breking News : కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం ఇక మహా సులభం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)కు అప్లై చేయాలనుకునే వారికి ఓ వెసులుబాటు కల్పించింది. ఇకపై కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు మీసేవా కేంద్రాల్లో(Mee Seva Centers) దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అదే విధంగా రేషన్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం స్థానికంగా ఉండే మీసేవా సెంటర్లలో సంబంధిత పత్రాలు జత చేయాలని సూచించింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యాక ఆరు పథకాల(Six Guarantees) అమలుకు రేషన్ కార్డులను ముఖ్య ఆధారిత ధ్రువపత్రంగా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించలేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి అనేక వేల మంది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు సమర్పించడానికే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. 2023 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారంటీల అమలుకు.. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే అర్హులుగా తెలిపింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు నేరుగా మండల కార్యాలయాల్లో సమర్పించాలని తెలియ జేసింది. అయితే ఈ పరిశీలన అంతా పూర్తయ్యి.. గత 2025 జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం మొదలు పెట్టింది ప్రభుత్వం. అయినప్పటికీ ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం కల్పిస్తూ.. మీసేవా కేంద్రాల ద్వారా కూడా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story