ఇంజినీరింగ్ విద్యార్థుల చేతుల్లోకి ప్రజాపాలన దరఖాస్తులు

by Mahesh |   ( Updated:2024-01-09 08:09:34.0  )
ఇంజినీరింగ్ విద్యార్థుల చేతుల్లోకి ప్రజాపాలన దరఖాస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజా పాలన పేరుతో ఐదు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా ఈ అప్లికేషన్ల తేదీ ముగియడంతో అధికారులు వాటిని ఆన్‌లైన్ లోకి ఎక్కించే పనిలో పడ్డారు. దీంతో ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వారు తమకు ఏదో స్కీమ్ వస్తుందని ఆశతో ఉన్నారు. కానీ ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఒక్కసారిగా అంతా అసహనానికి గురవుతున్నారు. లక్షల్లో అప్లికేషన్స్ రావడంతో ప్రభుత్వ అధికారులు ధరఖాస్తులను ఆన్‌లైన్లో ఎంట్రీ చేయడానికి ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్పజెబుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.

మంగళవారం ఉదయం ఇలానే ఓ వ్యక్తికి ర్యాపిడో ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు పంపుతుండగా అవి బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది మరవక ముందే మరో వీడియోలో ప్రజాపాలన దరఖాస్తులను ఇంజినీరింగ్ విద్యార్థులు ఆన్ లైన్‌లో ఎంట్రీ చేయడానికి తమ ఇళ్లలోకి తీసుకెళ్తున్నట్లు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే వాటికి భద్రత ఎలా సాధ్యం అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read More..

ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఎలా జరుగుతుందో తెలుసా? (వీడియో)

రోడ్డు పాలైన ‘ప్రజాపాలన’ అప్లికేషన్లు..! (వీడియో)

Advertisement

Next Story