- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy : వ్యూహం మార్చిన యాంటీ రేవంత్ టీం.. ఇకపై నేరుగా ఆమెతోనే డీల్..
దిశ, తెలంగాణ బ్యూరో: అధిష్టానం సర్దిచెప్పినా కాంగ్రెస్ నేతలు పంతం వీడటం లేదు. హస్తినలోనూ రేవంత్ వ్యతిరేక వర్గం భేటీ అయింది. ఎంపీ ఉత్తమ్ నివాసంలో మంగళవారం ఉదయమే పలువురు నేతలు సమావేశమయ్యారు. ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఈ సందర్భంగా రెండు గంటల పాటు చర్చించారు.
బహిరంగంగా వద్దు
యాంటీ రేవంత్ టీం వ్యూహం మార్చుతోంది. గతంలో మాదిరిగా బహిరంగ విమర్శలకు దిగకుండానే సహాయ నిరాకరణ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వర్గం ఒక విధంగా రేవంత్ చేసే కార్యక్రమాలకు దూరంగానే ఉంటోంది. ఇక ముందు కూడా అదే పంథా కొనసాగించాలని, కనీసం ఇతర పార్టీల నుంచి వచ్చే విమర్శలకు రేవంత్ తరపున మీడియాకు కూడా వెళ్లవద్దని సీనియర్లు నిర్ణయం తీసుకుంటున్నారు. సీనియర్లు వ్యతిరేకం చేస్తున్నారనే విషయాన్ని ఎక్కడా బహిరంగపర్చకుండా ఉండాలని భావిస్తున్నారు. అంతేకాకుండా యాంటీ రేవంత్ వర్గంగా ఉంటే సీనియర్లను కలుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కలుపుగోలుగా ఉంటూనే కలహాలు
రాష్ట్రంలో సీనియర్లు, నియోజకవర్గ నేతలు కాంగ్రెస్ కు దూరమవుతున్నా.. ఏఐసీసీ నుంచి రేవంత్ రెడ్డికి సహకారం ఉంటుందని ఈ బృందం భావిస్తోంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్ గా ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలో ఠాగూర్ కూడా చేరారు. విమర్శలకు దిగుతున్న నేతలు రేవంత్ తో పాటుగా ఠాగూర్ పైనా మాటల దాడి చేస్తున్నారు. ఈ పరిణామాలు ఏఐసీసీ నేతలకు కొంత ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఎటూ తెగడం లేదు. పార్టీ నుంచి వెళ్లపోనంటూ చెప్తూనే.. అధిష్టానంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఆయనకు తోడుగా ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి కూడా కలిశారు. అటు ఏఐసీసీ ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఠాగూర్ ఎదుటే ఆయన వాదనకు దిగారు. దీంతో మాణిక్కం ఠాగూర్.. మహేశ్వర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఈ వివాదం కేసీ వేణుగోపాల్ వరకూ వెళ్లింది. ఇలాంటి సమయంలోనే ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం ఏర్పాటు చేసి నేతలను సమన్యయం చేసే ప్రయత్నం చేశారు.
ఢిల్లీలోనే మళ్లా కుస్తీ
ఏఐసీసీ నేతల ఎదుట సమావేశం ముగిసిన గంటల్లోనే రాష్ట్ర నేతలు రేవంత్ కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఎంపీ ఉత్తమ్ నివాసంలో ఈ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశం జరుగుతుండగానే.. యాంటీ రేవంత్ టీం భేటీ అనే ప్రచారం బయటకు రావడంతో.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. కానీ, రేవంత్ కు వ్యతిరేకంగా ఎలా వ్యవహారించాలనే అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బహిరంగ విమర్శలకు దిగకుండా ఉండాలని, రేవంత్ టీం నుంచి వచ్చే వైఫల్యాలను మాత్రం ఏఐసీసీకి వెనువెంటేనే చేరవేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ నుంచి రాష్ట్ర నేతలకు స్పష్టమైన హామీ రావడంతో.. సీనియర్లకు మరింత అండ దొరికినట్లైంది. ఇక నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో తాను ఎంటరవుతానని, పర్యవేక్షణ చేస్తానన్నారు. రాష్ట్రానికి చెందిన నేతలు పార్టీకి సంబంధించిన అంశాలను తనతో చర్చించవచ్చని వెసులుబాటు కల్పించారు. ఇక నుంచి ప్రియాంకకు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు నివేదిక పంపించాలని పలువురు సీనియర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్? ఈ వారంలోనే అధికారిక ప్రకటన