- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ పోలీస్ శాఖలో మరో తీవ్ర విషాదం.. ఉరేసుకుని SI బలవన్మరణం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department)లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకొని ఎస్ఐ(AR) బలవన్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. సువర్ణపాక లక్ష్మినర్సు(36) అనే వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో ఎస్‌ఐ(Suvarnapaka Lakshminarsu)గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం అనూహ్యంగా ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా, ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.
ఇటీవల ములుగు జిల్లా వాజేడు ఎస్సై సురేష్ గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ చెరువులో శవాలై తేలారు. ఆ వెంటనే ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా కొల్చారంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కానిస్టేబుల్ సాయి సూసైడ్ చేసుకున్నాడు. వరుస ఘటనపై అప్రమత్తమైన పోలీస్ శాఖ ఆ దిశగా విచారణ చేపట్టింది.